MERI MARJI BOSS

By SAIF ALI SAYEED Writer ,Director

కొన్ని సంవత్సరాల క్రితం కొన్ని బ్లాగుల్లో ఫెస్బుక్ లో రాసేయవాడిని . సినిమా భూమి మొదలుపెట్టకముందు నుంచే ఎన్నో విషయాల కు సంబంధించి నా ఆర్టికల్స్ (నా అభిప్రాయాలు ) రాసుకుంటూ ఉన్నాను. తరువాతేప్పుడో ఈ విషయం అయి ప్రచురించుడామ్ అని వాయిదా వేయసుకున్న విషయాన్ని ఈ రోజు మహేశ్ జొన్నాదుల కొటేషన్ ముందుకు నెట్టి ఈ రోజే ప్రచురించే లా చేసింది. సినిమా మేకింగ్ ఇండిపెండెంట్ విషయం లో మహేశ్ అభిప్రాయం తో నేను ఏకీభవిస్తాను. మహేశ్ చెప్పినట్లు ఈ రోజు సినిమా మన సినిమా మనం చేసుకోవాలి అనేది నిజమే కానీ ,

ఒకటి ..సినిమా వేరు , ఇతర వ్యక్తిగత జీవితం వేరు, కొంతమందికి సినిమా వృత్తి కొంతమందికి హాబీ కొంతమంది కి సేవ కొంతమందికి పిచ్చి కొంతమందికి తాగుడు ఒక అలవాటు లాంటిది సినిమా. కొంతమందికి ఇవేమీ కాదు అలా వచ్చే ఒక అవకాశం

పస్తులు ఉండి కూడా సినిమా పనులు చేసుకునే వారిని నేను చూశాను. నేను ఏయదయినా రాసుకుంటూ కూర్చున్నప్పుడు ఆకలి ని మర్చిపోయిన రోజులు ఉన్నాయి .

రేపు ఎవరో బిర్యాని కి పిలుస్తారు అని
ఈ రోజు మనకున్న గంజి కూడా తాగకుండా పస్తులుండడం అనేది ఎవరెవరి ఇష్టం కదా . ప్రతీ మనిషి ప్రతి పని ఏరకంగా ప్రభావితుడు అయినా కానీ చివరకు తనకు ఇష్టమయితేనే చేస్తాడు. అది డబ్బు వచ్చే పని అయినా డబ్బు రాని పని అయినా అది ప్రతి మనిషి వ్యక్తిగత స్వేచ్చ స్వాతంత్రం వారి వారి హక్కు. వారి వారి బుధ్ధి జ్నానమ్ ఈటీసీ ఇండిపెండెంట్ సినిమా ఆలోచన మొదలుపెట్టిన కొత్తల్లో , నేను ఒక రోజు ఖాళీగా ఉంది షూటింగ్ చేయసుకుందామని ఒక నటుడిని పిలిచాను . యాక్టింగ్ కోసమే కృష్ణా నగర్ లో బతుకుతున్నావు కాబట్టి , నేను ఒక డైరక్టర్ గా ఈ రోజు ఖాళీగా ఉండకుండా కొన్ని షాట్స్ తీసుకుంటాను ఉన్న బట్టలు వేసుకోని వచ్చెయ్యమన్నాను. కానీ ఆ నటుడు షూటింగ్ రాకుండా యే కెమెరా తో షూటింగ్ చేస్తున్నారు? అనే విషయం నుంచి ఆరోజంతా క్యారక్టర్ గురించి , కధ గురించి మేకింగ్ గురించి ,తీసిన తరువాత ఏం చెయ్యాలి రక రకాల విషయాల మీద ఆ రోజంతా గంటల కొద్ది డిస్కషన్ పెట్టాడు . ఆ రోజు అతను ఎంషూటింగ్ చెయ్యలేదు నేను యేమి షూటింగ్ చేసుకోలేకపోయాను. ఆ రోజు షూటింగ్ లేకుండా వ్యర్ధం గా పోయింది.

అతను సెలబ్రిటీ కాదు కదా కనీసం ఒక చాయ్ తాగించాలంటే డబ్బుల్లేక యాక్టర్ కావాలి అనేయ కోరిక తో పెద్ద పెద్ద కెమెరాల ముందు నిలబడాలి అని కృష్ణానగర్ లో నటుడిగా ఆడిషన్స్ కు తిరుగుతుంటాడు. అప్పుడు అతనికి నేను అదే చెప్పాను ఈ రోజు నీ చేతిలో ఉంది ఇది ఇండిపెండెంట్ సినిమా అవకాశం ఈ డిస్కషన్ బదులు ఒక నటుడిలా , ఇలాగే నా కెమెరా ముందు మాట్లాడ కుండా కూర్చో ఒక పది నిముషాలు కనీసం నీ ఎక్స్ప్రెషన్స్ అయినా షూట్ చేయసుకొని పెట్టుకుంటాను అని అర్ధం చేయించే ప్రయత్నం చేసాను . రెండవ రోజు పెద్ద సినిమాల ఆడిషన్స్ కు తిరిగాడు . ఓ నటుడిగా ఒక దర్శకుడితో అన్నీ విషయాలు చర్చించి షూటింగ్ చేసుకోవాల లేక దర్శకుడి చెప్పింది ప్రశ్నించ కుండా చేసేయ్యాల అనేడి అతని స్వేచ్చ అతని హక్కు . అతని ఇష్టం . ఇలాగే ఇతర టెక్నీషియన్స్ కూడా ఎప్పుడు ఎవరికి ఎలా పనిచెయ్యాలీ ? పనిచెయ్యాలా వద్దా? అనేది ఆ రోజు వారికున్న ఇష్టాయిష్టాలు అంటే వాళ్ళ మూడ్ ని బట్టి ఉంటది. మనం అంతే సినిమా అన్నది కళ . కళ అనేది ఈ రోజు తినడానికి ఏమీలేక పోయిన సహజసిధ్ధంగా బయటకు వచ్చేస్తుంటది శుక్రియా యూనివర్స్


Posted

in

by

Tags: