MARTIN SCORSES దార్శనికుడు

By SAIF ALI SAYEED Director CUNNING FELLOW

ప్రపంచ సినిమా చరిత్ర ఎవరు రాసినా తప్పకుండా రాసే ఒక గోప్ప దర్శకుడు మార్టిన్ స్కోర్సెస్ అనే పేరు నిస్సందేహంగా ప్రత్యేకంగా రాయబడుతుంది . సినిమాని అద్భుతంగా తీయగల ఒక సిద్ధహస్తుడైన దర్శకుడు, కథకుడు ,ఒక దార్శనికుడు అని చేప్పవచ్చు. స్కోర్సెస్ యొక్క విశిష్టమైన కెరీర్ దశాబ్దాలుగా సినిమా తెరల మీద ప్రేయక్షకుల హృదయాలలో విస్తరించి ఉంది, కథలు చెప్పడం పట్ల అచంచలమైన అభిరుచి ,మానవ స్వభావం లోతులను అన్వేషించడంలో అసమానమైన నేర్పు ఈయన ప్రత్యేకత . సింపుల్ గా చెప్పాలంటే సినిమాలు కళాత్మకత తో పాటు సాంకేతికత కలయికలో ఒక మాస్టర్ క్లాస్ అనేలా ఉంటాయి. వాస్తవికత ,కవితాత్మకత మానవ జీవితాల అన్నీ అనుభూతుల సహజ మిశ్రమం ఈయన సినిమాలు . “టాక్సీ డ్రైవర్” అనే సినిమా లో న్యూయార్క్ నగరం లో కధ చూపిన , “ది ఏవియేటర్”లో గత యుగం యొక్క గొప్పతనాన్ని చూపినా, , లేదా “గుడ్‌ఫెల్లాస్”లో నేరం , విధేయత వాటి వాటి చిక్కులను విప్పి చెప్పినా, స్కోర్సెస్ లెన్స్ ప్రతి సినిమాలో ప్రత్యేకం. మానవ మనస్తత్వాలు ఈయన సినిమాలు . నటీ నటులతో సినిమాలు చేసినట్లు కాకుండా జీవింపచేసినట్లు ఫ్రేమ్‌పై చెరగని ముద్ర వేసే విలక్షణమైన దృశ్య శైలితో, స్కోర్సెస్ ఎవరికి పోటీ లేకుండా తనదైన సముచిత స్థానాన్ని ఏర్పరచుకున్నారు అనిపిస్తుంది. అలాగే ఈయన దర్శకత్వ పరాక్రమానికి మించి, ది ఫిల్మ్ ఫౌండేషన్ (google చేసి మరింత తెలుసుకోగలరు) వంటి కార్యక్రమాల ద్వారా సినిమా కళను పరిరక్షించడం మరియు ప్రోత్సహించడం పట్ల ఆయన నిబద్ధత ఆయన వారసత్వాన్ని వెండితెరకు నిజమైన వెలుగుగా నిలబెడుతుంది. మార్టిన్ స్కోర్సెస్ కేవలం చిత్రనిర్మాత మాత్రమే కాదు ఆయన తరతరాలుగా సినీ ప్రేక్షకులకు స్ఫూర్తిదాయకం అలాగే ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలలో ప్రతిధ్వనిస్తూనే ఉన్న టైమ్‌లెస్ సినిమాటిక్ కధనాల రూపశిల్పి. మాలాంటి యువ దర్శకులకు స్ఫూర్తినిచ్చిన ప్రపంచ దర్శకులలో ఈయన ఒకరు .ఈ సందర్భముగా రెండు వాక్యాలు రాయడం సంతోషంగా ఉంది. సమయం తీసుకోని ఒక సారి నాకు నచ్చిన సినిమా టాక్సీ డ్రైవర్ చూడండి. మీకు నచ్చుతుంది

ప్రేక్షకులు పాత్ర యొక్క దృక్కోణం నుండి చూస్తున్నట్లుగా వారికి అనుభూతిని కలిగించడం మంచిగా చేస్తారని ఈయన సినిమాలలో నాకు అనిపిస్తుంది


Posted

in

by

Tags: