DARE TO SHARE

By SAIF ALI SAYEED ,Director Cunning Fellow Movie

పెట్టిన డబ్బులు వస్తాయో రావో గ్యారంటి లేదు.
అయినా ఏ బ్యాక్ గ్రౌండ్ లేని ఒక వ్యక్తి ఇంట్లో అవసరానికి వచ్చే డబ్బు ని తీసుకొచ్చి సినిమా ని నిర్మించుకోవడం తనతో పాటు నలుగురికి స్క్రీన్ అవకాశం ఇవ్వడం ఒక పెద్ద విజయం
సినిమా పట్ల తనకు ఉన్న ప్రేమ ని తెలియజేస్తుంది.

తన లో ఉన్న నటుడికి అవకాశం ఇవ్వడం కోసం తను తీసుకున్న సినిమా కన్నింగ్ ఫెల్లో .
తనే డబ్బు పెట్టి తీసుకున్నప్పుడు ఒక ఇద్దరు హీరోయిన్లు పాటలు ఫైట్లు పెట్టి ఏదో ఒక రొమాంటిక్ సినిమా తీసుకుంటాడు అనుకుంటే  సైఫ్ నీకు నచ్చిన కధ చెప్పు తీద్దాం అన్నాడు.
తన తో పాటు దాదాపు 40 మంది వరకు కళాకారులకు ఒక సినిమా ఇస్తున్నాడు.
ఈ సినిమా మొదటి వర్కింగ్ పోస్టర్ గా నేను ఒకటి బయట పెట్టినప్పుడు ఆ పోస్టర్ మీద తనులేడు.  తను నటుడిగా నటిస్తూ తను ప్రోడ్యూసర్ గా చేస్తున్న ఒక సినిమా కు మొదటి వర్కింగ్ పోస్టర్ గా ఇతర నటుల ఫోటోలు వేసి బయటకు వదిలగలిగిన ధైర్యం ఇంకెంతమందికి ఉంటుందో నాకు తెలీదు. in present world ,తాము చేసిన సినిమా కు సంబంధించిన విషయాల లింకులని తమ స్టేటస్ లలో సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడానికి ధైర్యం చాలని కొంతమంది కళాకారులున్న ఈ ప్రస్తుత సమాజం లో మనతో పాటు పనిచేసిన వారికి చప్పట్లు కొట్టాలంటే చాలా చాలా ధైర్యం ఉండాలి మనం పనిచేసిన సినిమా పబ్లిసిటి లో మనం లేకపోయినా మనం ఒక టీం సభ్యులుగా ఫీల్ అయి వాటిని ప్రేమ గా గౌరవంగా షేర్ చేసుకోవాలంటే ధైర్యం ఉండాలి ,ఆ సినిమా ప్రమోషన్ మనం చెయ్యాలంటే మనలో గోప్ప మనిషి ఉండాలి   

టాలెంటు ఉండటం వేరు ఇతరులకు చప్పట్లు కొట్టడం ప్రశంసించడం, అవకాశం ఇవ్వడం వేరు
మహేశ్ ఒక ఇన్ సెక్యూర్ ఆర్టిస్టు కాకపోవడం అతని అదృష్టం. నా అదృష్టం . 

కన్నింగ్ ఫెల్లో టీం కు ఇలాంటి కో ఆర్టిస్ట్ ప్రోడ్యూసర్ కావడం అదృష్టం.ఆస్తి పాస్తులున్న కుటుంబం కాదు , ఫ ఈ సినిమా తీసే డబ్బుతో ఇంట్లో కొన్ని తులాలు బంగారం కొనవచ్చు మహేశ్ అని నేను అంటుంటాను.

  సినిమా అనుకున్న రోజు నుంచి పూర్తయ్యే వరకు ఎన్నో అభిప్రాయభేదాలు వచ్చాయి . కానీ , సినిమా మొదలు పెట్టినప్పుడే ఇద్దరు ఒక కమిట్మెంట్ అనుకున్నాం మన ఇగో కన్నా మన సినిమా ముఖ్యం అని .

ఈ సినిమా ద్వారా నాకు మరికొంతమంది మంచి టీం మిత్రులు దొరికారు. నటులుగానే కాకుండా వ్యక్తిత్వాలున్న మంచి మనుషులు దొరికారు. నా దృష్టికోణంలో ప్రస్తుతానికి నేను ఈ సినిమా విజయన్ని ఎంజాయ్ చేస్తున్నాను. ఆ సర్వేశురుడైన ఏకేశ్వరుడికి కృతజ్ఞతలు. Blessed. Thankyou Mahesh and ALL MY DEAR TEAM .
మహేశ్ తో పాటు ఈ కన్నింగ్ ఫెల్లో సినిమాలో నటించిన టీం అందరికి కృతజ్ఞతలు

be ready for more blessings…  


Posted

in

by

Tags: